నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో వున్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయి. దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా కారణంగా బయటి ప్రపంచానికి తెలియడంతో.. దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది