నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.