NTV Telugu Site icon

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడింది….

Harish Rao

Harish Rao

సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మంత్రులే రుణమాఫీ మొత్తం కాలేదని ఒప్పుకున్నారని హరీష్‌ రావు గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదాద్రి నర్సింహ స్వామి ని వేడుకున్నా అని ఆయన అన్నారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదని ఆయన మండిపడ్డారు.

Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ నేలమట్టం..(వీడియో)

రైతు భీమ, రైతు బంధు, చెరువులు నింపిన ఘనత కేసీఆర్ ది అని ఆయన వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అని ఆయన ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏవి..?? అని ఆయన అన్నారు. అసెంబ్లీలో చర్చకు ఎందుకు భయపడ్డవ్ రేవంత్ రెడ్డి అని, పోలీసులను హెచ్చరిస్తున్న, మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, చీఫ్ సెక్రటరీ మెడలు వంచైనా సరే ఋణమాఫి చేయిస్తామన్నారు హరీష్‌ రావు. మోసం రేవంత్ రెడ్డి ది, పాపం కాంగ్రెస్ పార్టీది న అని హరీష్‌ రావు మండిపడ్డారు.

KTR : రుణమాఫీలో కటింగ్ పెడితే.. రైతుభరోసాలో కూడా కటింగ్‌లు పెడుతాడు