Harish Rao Fires On BJP Congress Party Leaders: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బిజెపి వాళ్ళవి మాయమాటలని.. జనాలను కన్ఫ్యూజ్ చేసి, ఓ నాలుగైదు సీట్లు గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన చెరువుల పండుగలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత చెరువులన్ని జలకళ సంతరించుకున్నాయని అన్నారు. మిషన్ కాకతీయను అమెరికాలో ఉండే విచిగాన్ యూనివర్సిటీ ఒక స్టడీగా తీసుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను కాపీ కొట్టిందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ మన చెరువులకు 5 వేల కోట్లు ఇవ్వమంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదంటూ ఫైరయ్యారు.
Allu Arjun: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో ఆదిపురుష్..?
ఢిల్లీలో మనల్ని మెచ్చుకుంటారు కానీ, గల్లీల్లో వచ్చి బీజేపీ వాళ్లు తిడుతారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లది లంగా రాజకీయమని, తెలంగాణ పథకాలన్నీ కేంద్రం కాపీ కొట్టిందని దుయ్యబట్టారు. గాంధీ భవన్‌లో, ఢిల్లీలో కూర్చొని కాళేశ్వరం దండగ అని మాట్లాడుతారని.. అలా అన్న వాళ్లను రాజ్‌గోపాల్ పేట్ చెరువులో ముంచాలని అన్నారు. తెలంగాణలో కరెంట్ లేదనే వాళ్లు కరెంట్ తీగలు పట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి.. కేవలం ఏడు సంవత్సరాలలోనే జరిగిందని, రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఆగిపోయిందని తెలిపారు. యాసంగిలో ఆంధ్రలో 17 లక్షల ఎకరాల్లో నాటు వేస్తే.. మనం 57 లక్షల ఎకరాల్లో వరి వేశామన్నారు.
Tamannah Bhatia: బీచ్ ఒడ్డున డాన్స్ చేస్తూ… బాల్యాన్ని గుర్తుచేసుకున్న మిల్కీ బ్యూటీ !
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విషం కక్కుతున్నారని హరీష్ రావు తూర్పారపట్టారు. మహారాష్ట్ర రైతులు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, కేసీఆర్ పాలన దేశం మొత్తం కావాలని కోరుకుంటోందని వెల్లడించారు. తనకు ఓపిక ఉన్నంతవరకు మీకు సేవ చేస్తానని.. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి హరీష్ రావు హామీ ఇచ్చారు.