NTV Telugu Site icon

Harish Rao: రైతుబంధుపై నేను తప్పుగా మాట్లాడలేదు..

Harish Rao

Harish Rao

Harish Rao: రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు. రైతు సోదరుడిని ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఆపగలరని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ మాత్రమే వచ్చి ఇస్తారని అన్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన జన ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. రైతుబంధుపై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇవ్వదని… ఇచ్చిన వారిని ఆపడమే తమ పని అని అన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ కు ఉన్న బంధం ఓట్ల బంధం కాదన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినప్పటికీ రైతుబంధుకే ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం 11 సార్లు రైతు బంధు ఉత్సవాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఓట్ల కోసం కాదని, రైతులపై ప్రేమతో రైతుబంధు ఇస్తున్నారని అన్నారు.

Read also: PM Modi: కేసీఆర్ కలిసేందుకు వచ్చినా నేను కలవలేదు.. ఎందుకంటే..

రైతుబంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 16వేలు కేసీఆర్ ఇస్తే… రైతుకు రూ. 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రైతుబంధు అంతం అవుతుందని కాంగ్రెస్ నేతలకు ఓట్లు వేయాలని అన్నారు. రైతుబంధుపై ఎన్నికల ప్రచార సభలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. ఇందులో ఏమైనా పొరపాట్లు వుందా అని ప్రశ్నించారు. సోమవారం ఉదయం టీ తాగితే రైతుబంధు నిధులు అందినట్లు ఫోన్‌లో నోటిఫికేషన్‌ వస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రైతుబంధును తిరస్కరించింది. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందన్నారు. రైతన్న నోటికాడి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. తాను తప్పేం మాట్లాడలేదని.. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని హరీష్ రావ్ క్లారిటీ ఇచ్చారు.
Ponguleti: కేసీఆర్ కలల్ని పగటి కలలు చేయాలి.. కాంగ్రెస్ ను ఆదరించాలి