Ponguleti: కేసీఆర్ కలల్ని పగటి కలలు చేయాలి.. కాంగ్రెస్ ను ఆదరించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. భద్రాద్రి ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ కార్నర్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , అభ్యర్థి ఫోరమ్ కనకయ్య పాల్గొన్నారు. బీఆర్ఎస్ దొంగల పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అయ్యాడని అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ కష్టాలు అనుభవించారని తెలిపారు. బీఆర్ఎస్ ద్రోహులను పారద్రోలి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సముచిత న్యాయం దొరుకుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణ సొమ్ము లక్ష కోట్లను అక్రమంగా సంపాదించాడని అన్నారు. కేసీఆర్ కలల్ని పగటి కలలు చేయాలని పిలుపునిచ్చారు.
Read also: KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి
ఎన్నికల్లో మంచి తీర్పించి కాంగ్రెస్ ను ఆదరించాలని అన్నారు. బొగ్గుకు పుట్టినిల్లు ఇల్లందు అన్నారు. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. బొగ్గు గనుల ప్రవేట్కలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. కొంతమందికే పోడు భూముల పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బయ్యారం ఉక్కు గనుల పరిశ్రమను స్థాపిస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందన్నారు. పేదలకు ఇళ్ల స్థలంతో పాటు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. ఇల్లందు మండలంలోని కొమరారం, టేకులపల్లి మండలంలోని బోర్డును మండలాలుగా ప్రకటిస్తామన్నారు. ఎవరెంత ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి