Harish Rao : వీటికి జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలి.. కేంద్రంను కోరిన హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరారు.
Also Read : Naseeruddin Chisti: ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సూఫీ కౌన్సిల్ ఆగ్రహం
తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. అయితే ప్రతి ఏడాది వీటి నిర్వహణ చేయడం ఎంతో ముఖ్యం. ఈ పనులు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తున్నది. ఈ నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వండి అని కోరడం జరిగింది.
పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలుకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నదనీ, అందువల్ల జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
Also Read : Ind vs Ban: లక్ష్య ఛేదనలో బంగ్లా విలవిల.. విజయానికి చేరువలో టీమిండియా!
బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాము. బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్ల మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు.
Also Read
టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్ స్వాగతిస్తున్నాము. అయితే దీనిపై ఉన్న సంశయాలను కౌన్సిల్ దృష్టికి తెస్తున్నాం. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్ వల్ల కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పే టీఎం, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాలి అని కోరుతున్నాం.
మైనర్ ఇరిగేషన్, పిడిఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, బీడీ ఆకులపై జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై జీఎస్టీ పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్ మెంట్ కమిటీకి సిఫార్సు చేస్తూ, ఆదేశించింది. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించారు.
బీఅర్కే భవన్ నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేష్ కుమార్, కమిషనర్ కమర్షియల్ టాక్స్ నీతూ ప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!