Site icon NTV Telugu

Gutha Sukender Reddy: కేటీఆర్‌ పై కుట్రలు చేస్తున్నారు.. కేంద్రంపై గుత్తా సీరియస్

Gutta Sukhender Reddy

Gutta Sukhender Reddy

Gutha Sukender Reddy: కేటీఆర్‌ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకున్న కార్పొరేట్ దొంగలపై ఎలాంటి విచారణలు ఉండవు కానీ లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో కేంద్రం దూరాలోచన చేసి, ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్‌ మీద కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: TDP: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం.. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను దాటుకుంటూ ప్రయాణం

మంత్రి కేటీఆర్ పై కూడా పేపర్ లీకేజీలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. టీఆఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ నిజాయితీ పరుడని, ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు గుత్తా సుఖేందర్‌. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లుకు అసత్యాలు ప్రచారం చేయడమే వారి పని ఆరోపించారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ కు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవుని, రాష్ట్రంను ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకుంది కేంద్రం అంటూ నిప్పులు చేరిగారు. గవర్నర్ వ్యవస్థ కూడా బ్రష్టు పట్టించారు బీజేపీ వాళ్ళు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో బిల్లులను పెండింగ్ లో పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు గవర్నర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం.. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను దాటుకుంటూ ప్రయాణం

Exit mobile version