Gutha Sukender Reddy: సీఎం రేవంత్ బందువైనప్పటికీ.. తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడ కలవలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరాలని అమిత్ కు ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే అన్నారు. కానీ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. కొందరు నేతలు సహకరించకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేవద్దని అమిత్ నిర్ణయించుకున్నారని అన్నారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానని, ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని తెలిపారు. సీఎం రేవంత్ పరిపాలన బాగానే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం రెండు నెలల ముందు అమిత్ ను ప్రకటించి ఉంటే బాగుండేదని తెలిపారు. పలు మార్లు ఆహ్వానిస్తేనే తాను బీఆర్ఎస్ లోకి వచ్చానని, సీఎం రేవంత్ బందువైనప్పటికి.. తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా సీఎం రేవంత్ ను ఎక్కడ కలవలేదని అన్నారు.
Read also: Viral: ఇదేందిరయ్య.. ఎప్పుడు చూడలే.. రంపం టైర్లతో దూసుకుపోతున్న స్పోర్ట్స్ బైక్..!
కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైందని వార్తలు వచ్చాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి గుత్త తనయుడు అమిత్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే నల్లగొండ టికెట్ ఖరారు చేసిన పార్టీ భువనగిరి టిక్కెట్టును పక్కన పెట్టింది. దీనిపై ఇటీవల గుత్తా అమిత్ సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గుత్తా తండ్రీతనయులు కేసీఆర్ కు గుడ్ బై చెప్పారని, గుత్తా.. రేవంత్ గూటికి చేరడం ఖాయమని వార్తలు గుప్పుమన్నాయి.
Read also: Lok Sanha Elections 2024: రేపు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన నల్గొండ పార్లమెంట్ స్థానం సమావేశానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రాలేదు. అప్పుడే పార్టీలో వారిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగళవారం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంటికి రావడంతో ఆయన చేరిక లాంఛనమేనన్న ప్రచారం ఊపందుకుంది. కాగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి తనయుడు కుందూరు రాఘవరెడ్డికి నల్గొండ టిక్కెట్టును ఇప్పటికే ప్రకటించారు. భువనగిరి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. భువనగిరి టిక్కెట్టును అమిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అమిత్‌కి ఈ టికెట్‌పై పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా గుట్టకు తక్కువ చేసిందేమీ లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేయవచ్చని క్లారిటీ ఇచ్చింది.
Venkatesh: వెంకటేష్ కూతురి మెహందీ సెలెబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీ..