Harish Rao : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు భవిష్యత్తు నిర్మాణంగా నిలిచిన గురుకులాలు, ప్రస్తుతం నిర్వీర్యం అవుతుండటం దురదృష్టకరమని ఆయన ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనత లక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఆశలను పాతాళానికి నెట్టేసింది’’ అని హరీష్ రావు విమర్శించారు. గతంలో ఆదర్శంగా నడిచిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడు నాణ్యత కోల్పోయిన స్థితిలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
HHVM : యానిమల్ చూసి బాబీ డియోల్ క్యారెక్టర్ మార్చేశా : దర్శకుడు జ్యోతికృష్ణ
‘‘ఈ సంవత్సరం జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్డు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయింది. జూలై 1 నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరఫరాలు నిలిపేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రెండోపక్క 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు పెండింగ్ లో ఉండటంతో, పలుచోట్ల భవన యజమానులు స్కూళ్లకు తాళాలు వేయడం ప్రారంభించారని తెలిపారు.
విద్యా సంవత్సరం మొదలై ఎన్నో రోజులు గడుస్తున్నా.. యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు వంటి బేసిక్ అవసరాలను ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కల్వకుంట్ల ప్రభుత్వం సమయంలో గొప్పగా అభివృద్ధి చెందిన గురుకులాల వ్యవస్థ, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో క్రమంగా కూలిపోతోందని, పాత, చినిగిన దుస్తులు వేసుకుంటూ స్కూళ్లకు వస్తున్న చిన్నారుల దుస్థితి చూస్తే మనసు కలుస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Trump-Modi: జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే ఛాన్స్!
