Harish Rao : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు భవిష్యత్తు నిర్మాణంగా నిలిచిన గురుకులాలు, ప్రస్తుతం నిర్వీర్యం అవుతుండటం దురదృష్టకరమని ఆయన ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనత లక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల…