Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
- క్యాబినెట్లో కీలక నిర్ణయం
- జీపీల ఖాతాల్లోకే నిధులు
- ట్రెజరీ అవసరం ఇక లేదు
- గ్రామాభివృద్ధికి ఊతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Governance : తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించేలా, రేపు జరగబోయే మంత్రివర్గ (క్యాబినెట్) సమావేశంలో ‘తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018’ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ సవరణలో భాగంగా, పంచాయతీ రాజ్ చట్టంలోని 70(3) సెక్షన్‌ను సవరించి, గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో కాకుండా.. ఇకపై నేరుగా ఆయా జీపీల (GP) బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసే అవకాశం ఉంది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ఈ చట్ట సవరణతో గ్రామాల్లో స్థానికంగా సమకూరే పన్నులు, ఇతర సొంత వనరుల ఆదాయం నేరుగా పంచాయతీల గుప్పిట్లోకి రానుంది. దీనివల్ల నిధుల కోసం ప్రభుత్వ ట్రెజరీపై ఆధారపడాల్సిన అవసరం తప్పడమే కాకుండా.. గ్రామంలో వసూలైన డబ్బును వెంటనే స్థానిక అభివృద్ధి పనుల కోసం వేగంగా ఖర్చు చేసుకునే వీలు కలుగుతుంది. ఫలితంగా గ్రామాల్లో అత్యంత కీలకమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఇతర అత్యవసర మౌలిక వసతుల పనులు ఎక్కడికక్కడ ఎలాంటి జాప్యం లేకుండా మరింత వేగంగా సాగేందుకు మార్గం సుగమం కానుంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!