NTV Telugu Site icon

MLC Polling: ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..

Graduate Mlc By Election Polling Started

Graduate Mlc By Election Polling Started

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605.. 807 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

పురుష ఓటర్లు… 2 లక్షల 88 వేల 189, మహిళలు 1 లక్షా 75 వేల 645, ఇతరులు ఐదుగురు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో 1 లక్షా 66 వేల 448 మంది ఓటర్లు, 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 80,871 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 51,560 మంది, మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. వీరి కోసం 97 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 144 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34,176 మంది, మహిళా ఓటర్లు 17,321 మంది ఉన్నారు.

Read also: TSPSC Group 1: గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు..

వారి కోసం 71 పోలింగ్ కేంద్రాలు. 99 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 20,838 మంది, మహిళా ఓటర్లు 13,242 మంది ఉన్నారు. వీరి కోసం 37 పోలింగ్ కేంద్రాలు, 59 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఉన్నారు. 55 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండల కేంద్రాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల్లో 4659 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. EC మార్గదర్శకాల ప్రకారం 20 శాతం అదనపు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి.
Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..

Show comments