ప్రభుత్వ , ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణ కోసం గైడ్ లైన్స్ తయారు చేయడానికి కమిటీ వేసింది ప్రభుత్వం. ఈకమిటీలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా సభ్యులుగా కమిటీ వేశారు. ఈ రోజు కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు విద్యా శాఖ మంత్రి సబితా, డీజీపీ, విద్యా శాఖ అధికారులు. ప్రభుత్వ ,ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణ కోసం గైడ్ లైన్స్ తయారు చేస్తామని, వారి భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
Read Also:Ramdev Baba: రాందేవ్ బాబా దిష్టిబొమ్మ దగ్ధం… మహిళా కాంగ్రెస్ ఆందోళన
కమిటీలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా సభ్యులుగా వ్యవహరిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్ధుల భద్రత ఎండమావిగా మారిందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇటీవల బంజారా హిల్స్ లో ఓ ప్రైవేట్ స్కూళ్లో ముక్కుపచ్చలారని చిన్నారిపై వేధింపుల నేపథ్యంలో చిన్నపిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని స్కూళ్ళకు పంపాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల భద్రత సరిగా లేని స్కూళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కమిటీ ఇలాంటి కీలకమయిన అంశాలపట్ల కఠినంగా వ్యవహరించాలని, తల్లిదండ్రులకు భరోసా కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Read Also: Hanuman: హనుమాన్ టీజర్ ను మెచ్చిన ‘ఆదిత్య 369’ డైరెక్టర్