Hanuman: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎంతటి సంచలనం సృస్టించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హనుమాన్ టీజర్ ను చూపిస్తూ ఆదిపురుష్ టీజర్ ను ట్రోల్స్ చేశారు. అతి తక్కువ బడ్జెట్ లో అత్యద్భుతమైన విజువల్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇక తాజాగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు శాతం ఈ టీజర్ పై ప్రశంసలు కురిపించారు. విజువల్స్, ఎఫెక్ట్స్ అంటే టాలీవుడ్ లో సింగీతం పేరు వినిపిస్తుంది. అప్పట్లోనే భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలను తీసి ఔరా అనిపించిన సత్తా ఆయనది. ఇక తాజాగా హనుమాన్ టీజర్ ను సింగీతం మెచ్చుకున్నారు. ” ఇప్పుడే హనుమాన్ టీజర్ చూసాను. యానిమేషన్, విజువల్స్, కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉన్నాయి. టీజర్ ఆరంభంలో భారీ ఆకారంలో హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా.. అనిపించేలా ఉంది. భక్తిభావం కలుగుతోంది. ప్రశాంత్‌వర్మకు హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాలో ఈ సినిమా ఒక గొప్ప మార్క్ సృష్టించనుంది” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.