Site icon NTV Telugu

Governor Bhadradri Visit : భద్రాద్రి వరద ముంపు గ్రామాల్లో గవర్నర్ తమిళసై పర్యటన

Governor Tamilisai

Governor Tamilisai

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేప‌థ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గ‌వ‌ర్న‌ర్‌. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్‌ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావ‌రి వ‌ద‌ర‌ 30 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా నీటిమట్టం పెరిగింద‌ని అధికార‌లు వెల్ల‌డించారు. గోదావ‌రి వరద ఎక్కువ‌గా వుండ‌టంతో.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

read also: Live Video: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర

అయితే వ‌ర‌ద కార‌ణంగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు అధికారులు. వ‌ర‌ద కార‌ణంగా.. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. కాగా.. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జ్ పై రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి.

CM KCR Aerial Survey: మంపు ప్రాంతాల్లో సీఎం సర్వే.. పర్యటన షెడ్యూల్​ ఇలా..

Exit mobile version