Tamilisai: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilisai: టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను గవర్నర్ అభినందించారు. నెల రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫార్సులపై ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్‌గా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో కేసీఆర్ వెలుగు నింపారు. నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక నెరవేరింది.
Read also: Adilabad: ఆ నలుగురు సినిమా సీన్ రిపీట్.. మృతదేహం ముందే ఆస్తిపంపకాలు..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరోనా కారణంగా ఆర్టీసీ నష్టాలను మూటగట్టుకుని లాభాలను ఆర్జిస్తోంది. అయినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. వేలాది మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజల హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసీకి నివాళి. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సమ్మెలో సకల జనులు పాల్గొన్నారు. వారి కుటుంబాలు, జీతాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమం ఊపిరి పీల్చుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్, వేతనాలు పెంచారు. ఇతర సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు.
TS Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!