TS Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Heavy Rains: అల్పపీడనం కారణంగా నేడు, రేపు తూర్పు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు 13 జిల్లాకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ కు నేడు, రేపు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్ ఐఎండీ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Read also: Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 6-8 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, జియ్యమ్మవలస ప్రాంతాల్లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
MAD Song: ఈ సాంగ్ సింగిల్స్ అందరికీ అంకితం…
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!