తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కలవడం లేదు అని విమర్శలు గతంలో ఉన్న సమయంలో నేను ప్రజలను కలుస్తాను. అవసరమైతే రాజ్ భవన్ లో ఒక సెల్ కూడా పెడతాను అని గవర్నర్ గా మీరు చెప్పారు. అది ఎందుకు ఇంకా ప్రారంభం కాలేదు అని అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… నేను ప్రజా దర్భార్ ప్రారంభించాలి అనుకున్నాను. ఆ ఆలోచన నాకు ఇంకా ఉంది. నేను సెప్టెంబర్ లో ఇక్కడికి వచ్చాను. డిసెంబర్ లో కరోనా వచ్చింది. ఆ కారణంగా దానిని ముందుకు తీసుకవెళ్లలేకపోయాం. ఇక సీఎం కారుఅక్రమాల గురించి నేను ఏం మాట్లాడాను.అయితే నేను ఎప్పుడు ప్రజల మనిషిని. అయితే కొంత మంది గవర్నర్ అంటే రాజ్ భవన్ లోనే ఉంటారు. రాజ్ భవన్ తలుపులు ఎప్పుడు ముందే ఉంటాయి. గవర్నర్ కొన్ని ఫైల్స్ చూస్తూనే ఉంటారు. గవర్నర్ ప్రజలను కలవారు అనే ఒక అపోహను కల్పించారు. కానీ నేను దానిని మార్చాలి అనుకుంటున్నాను అని తమిళిసై తెలిపారు.