JPS Strike: జేపీఎస్ కు సాయంత్రం వరకు డెడ్ లైన్.. లేదంటే టర్మినేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JPS Strike: రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇవాల సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జేపీఎస్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే, చేరని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కాగా.. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని తెలిపారు.
Read also: TS Inter Results: నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఈజీగా తెలుసుకోండి
Also Read
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సర్వీస్ డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుంచి జేపీఎస్ యూనియన్‌గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో సుల్తానియా పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తను సొసైటీలు, యూనియన్లు చేరనని బాండ్‌పై సంతకం చేశానని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మె చేసే హక్కు లేదని ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్‌గా ఏర్పడి, చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుండి సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయిందని సుల్తానియా అన్నారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చివరి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఇవాల (మే 9) సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇవాల సాయంత్రం లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
Man beats wife : అన్నం వండలేదని భార్యనే చంపేసావా! .. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తిను
తాజావార్తలు
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’… సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!