Telangana Govt: రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గతేడాది నవంబర్ 30న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన ఆ పార్టీ నేతలకు కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవులు కట్టబెట్టారు. మరికొందరికి పదవులు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులు తమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ల పదవులకు రాజీనామా చేశారు. ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వారిని నియమించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు పదవుల భర్తీ దోహదపడుతుందని పార్టీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు నేతలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. దీంతో.. టిక్కెట్లు ఇవ్వలేని వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు.
కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కిన వారు వీరే..
1. నూతి శ్రీకాంత్ (బీసీ ఆర్ధిక సంస్థ)
2. శివసేన రెడ్డి (తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ)
3. గుర్నాథ రెడ్డి (పోలీస్ గృహ నిర్మాణ సంస్థ)
4. పటేల్ రమేష్ రెడ్డి (పర్యాటక అభివృద్ధి సంస్థ)
5. రాయల నాగేశ్వరరావు (వేర్‌హౌస్ కంపెనీ)
6. నెరెల్ శారద (మహిళా కమిషన్)
7.ఎన్. ప్రీతమ్ (SC కార్పొరేషన్)
8. బెల్లయ్య నాయక్ (గిరిజన సహకార సంఘం)
9. రియాజ్ (లైబ్రరీ పరిషత్)
10. మెట్టు సాయికుమార్ (ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్)
Read also: Iceland Volcano: ఐస్‌లాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. మూడు నెలల్లో నాలుగోసారి!
11. జగదీశ్వరరావు (నీటిపారుదల అభివృద్ధి)
12. జంగా రాఘవరెడ్డి (ఆయిల్ ఫెడ్)
13. అనిల్ (మైనింగ్ కార్పొరేషన్)
14. జ్ఞానేశ్వర్ (విజయ డెయిరీ)
15. ఎం.విజయబాబు (స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ అసోసియేషన్)
16. బండ్రు శోభారాణి (మహిళా సహకార అభివృద్ధి సంస్థ)
17. నిర్మల (ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
18.ఎం. మోహన్ రెడ్డి (రాష్ట్ర సహకార సంఘం)
19. ఎస్. అన్వేష్ రెడ్డి (విత్తనాభివృద్ధి సంస్థ)
20. కాసుల బాలరాజు (ఆగ్రోస్ కంపెనీ)
Read also: Donald Trump : ఎన్నికల్లో గెలవకపోతే రక్తపాతం తప్పదు.. బెదిరించిన డొనాల్డ్ ట్రంప్
21. జనక్ ప్రసాద్ (కనీస వేతనాల సలహా మండలి)
22. ఎం. వీరయ్య (వికలాంగుల సంస్థ)
23. మల్ రెడ్డి రామ్ రెడ్డి (రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
24.పి. వీరయ్య (అటవీ అభివృద్ధి సంస్థ)
25. చల్లా నరసింహా రెడ్డి (అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
26.ఎన్. సత్యనారాయణ (హస్తకళల సంస్థ)
27. M.A. జబ్బార్ (మైనారిటీ ఆర్థిక సంస్థ)
28. కాల్వ సుజాత (వైశ్య సంస్థ)
29. కె. నాగు (గిరిజన సహకార మరియు ఆర్థిక అభివృద్ధి సంస్థ)
30.ఎ. ప్రకాష్ రెడ్డి (స్టేట్ ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్)
31. జైపాల్ (అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ)
32.ఎన్. గిరిధర్ రెడ్డి (ఫిల్మ్ డెవలప్‌మెంట్ కంపెనీ)
33. M.A. ఫహీమ్ (తెలంగాణ ఫుడ్స్)
34. మన్నె సతీష్ (స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
35.పి. అలేఖ్య (సంగీత నాటక అకాడమీ)
36.కె. నరేందర్ రెడ్డి (శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ)
37. వెంకట్రామ్ రెడ్డి (కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ)
IPL 2024: అభిమానులకు శుభవార్త.. భారత్ చేరుకున్న విరాట్ కోహ్లీ! ‘కింగ్’ వీడియో వైరల్
