13 lakhs of Loan Money: తెలంగాణ రాష్ట్రంలో వరుస దొంగతనాలు ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్న నాగోల్ స్నేహపురి కాలనీలో బంగారం చోరీ ఘటన.. నిన్న బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ సైట్-2లో భారీ చోరి.. నేడు నిజామాబాద్ జిల్లా లోని సినీ పక్కిలో 13 లక్షలు చోరీ వరుస ఘటనలు సంచలనంగా మారాయి. కారు అద్దాలు పగలగొట్టి మరీ లక్షల్లో డబ్బులు కాజేశారు. దీంతో యజమాని పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Pongal Gift: సంక్రాంతి కానుక.. ప్రజలకు నగదు, పొంగల్ గిఫ్ట్
నిజామాబాద్ మోపాల్ మండలం తాడేం గ్రామానికి చెందిన సర్యూ రెడ్డి అనే వ్యక్తి 13 లక్షల 30 వేలు గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి లోన్ తీసుకొని కారులో డబ్బులు పెట్టుకొని బంధువుల ఇంటిదగ్గరకు వెళ్లాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్లే సరికి ఒక్కక్షణంలో అంతాజరిగిపోయింది. ఇంటి లోపలికి వెళ్లేందుకు ముందు అడుగుపెట్టి కారులో డబ్బులు ఉన్నాయి కాదా అవికూడా తీసుకుని వెళదాం అనుకునేలోపే కారు అద్దాలు పగలగొట్టి డబ్బులను దొంగతనం చేశారు దుండగులు. దీంతో షాక్ కు గురైన యజమాని సూర్యా రెడ్డి అరుస్తూ వచ్చేలోపే డబ్బులు తీసుకుని పరారయ్యారు దుండగులు. దీంతో సూర్యా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.
Read also: Veera Simha Reddy: ఈ పాటలో బాలయ్య బాబు డాన్స్ ఉంటుంది రా చారీ…
సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు యజమాని సూర్యను లోన్ తీసుకుని, అక్కడి నుంచి డబ్బులు లక్షల్లో తీసుకుని బయటకు రావడం గమనించిన దొంగలు సూర్యను వెంబడించి, బంధువుల ఇంటి వద్ద కారు ఆగడంతో ఇదే సమయం అని భావించిన దుండగులు కారులో వున్నడబ్బును ఎత్తుకుని వెళ్లినట్లు గమనించారు పోలీసులు. అయితే వీళ్లకు సూర్య లోన్ ద్వారా లక్షల్లో డబ్బులు తీసుకుంటాడని ముందే తెలుసా? లేక లోన్ ఇచ్చిన వారే ఎరికైనా ఈ వార్తను చేదీశారా? లేక బంధువులకు, కుటుంబ సభ్యులకు ముందే లోన్ ద్వారా లక్షల్లో డబ్బులు తీసుకోవడం చెప్పడంతో వారి ద్వారా ఎవరైనా సూర్యాను ఫాలో అయి ఈ దొంగతనానికి పాల్పడ్డారా? అసలు లోన్ లో ఇంత డబ్బులు తీసుకున్న సూర్య బంధువుల ఇంటికి ఎందుకు వెళ్లాడు? అక్కడకు రమ్మని ఎవరు కాల్ చేశారు? దొంగతనానికి పాల్పడేందుకే ఇలా ప్లాన్ వేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kaikala Satyanarayana: స్టార్స్ తో సత్యనారాయణ చిత్రాలు!