CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy vs KTR : గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం నెలకొంది. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, “పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడు” అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సీసీఎస్‌లో అధికారికంగా ఫిర్యాదు చేస్తేనే గ్లోబరీనా అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, తాను నేరుగా చొరవ తీసుకుంటే కక్షసాధింపు చర్యగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. అలాగే జన్వాడ భూములు, గ్లోబరీనా వ్యవహారం ఎలా ముడిపడి ఉన్నాయో విచారణ చేయిస్తామని సీఎం వ్యాఖ్యానించారు.
దీనికి గట్టి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, తాను ఇప్పటికే సీఎంకు డిఫమేషన్ నోటీసు పంపానని, సరైన సమాధానం రాకపోతే కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. గ్లోబరీనా తన సంస్థే అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుందో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే వెంటనే విచారణ జరిపించాలని, తామిద్దరం లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి ఏ అంశంపైనా కేసులు పెట్టుకోవచ్చని, రాహుల్ గాంధీతో వచ్చి తన ఇంటి ముందు ధర్నా చేసినా సిద్ధమేనని వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతోంది.
Also Read
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?