Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, యాపిల్, హెచ్‌ఎస్‌బీసీ, ఏడీపీ, గూగుల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమేజాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, నోవార్టిస్, డెలాయిట్ తదితర సంస్థల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉన్న సంగతి తెలిసిందే.
ఊపందుకున్న డెబిట్ కార్డుల జారీ
గత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఏడు నెలల్లో మందగించిన డెబిట్ కార్డుల జారీ ప్రక్రియ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లోని మొదటి ఐదు నెలల్లో ఊపందుకుంది. కమర్షియల్ బ్యాంకులు దాదాపు 17 మిలియన్‌ల కార్డులను వినియోగదారులకు అందజేశాయి. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో బ్యాంకులు 13 మిలియన్‌ల కార్డులను మాత్రమే జారీ చేశాయి. యాక్టివ్‌గా లేని ప్లాస్టిక్ కార్డులను ఏరివేయటం ద్వారా బ్యాంకులు తమ కార్డ్ పోర్ట్‌ఫోలియోలను క్లీనప్ చేయటం వల్లే గతేడాది చివరి ఏడు నెలల్లో కొత్త కార్డుల జారీ వేగం తగ్గింది.
read also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.
డీ-మార్ట్ ఆదాయ వృద్ధి 35 శాతం పైనే
డి-మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 35 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని సాధించింది. దీంతో 10,384 కోట్ల రూపాయల రెవెన్యూని నమోదు చేసింది. గతేడాది ఈ ఆదాయం 7649 కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొందిన రెవెన్యూ వివరాలను రెగ్యులేటరీకి సోమవారం సమర్పించిన నివేదికలో డీ-మార్ట్ వెల్లడించింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
నిన్న పండుగ సెలవు అనంతరం ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 445 పాయింట్లు పెరిగి 58510 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 123 పాయింట్లు లాభపడి 51910 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.64 పలుకుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,940, కిలో వెండి రూ.61,579 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇవాళ రిల్, ఓఎన్‌జీసీ, ఓఎంసీస్, డీఎల్‌ఎఫ్, స్పైస్‌జెట్, జీ, బీఓబీ షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి.
