NTV Telugu Site icon

వినాయక నిమజ్జనం.. సుప్రీంకోర్టుకు జీహెచ్‌ఎంసీ

వినాయక నిమజ్జనం అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌ వైపే చూస్తారు.. ముఖ్యంగా నిమజ్జన శోభాయాత్ర.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంపైనే అందరి దృష్టి.. అయితే, ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారిపోయింది… వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది జీహెచ్‌ఎంసీ.. వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్.. ఒకటి రెండు రోజులలో సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందంఉటన్నారు.. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది జీహెచ్‌ఎంసీ.. మరి.. కింది కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది..? ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది.