Hyderabad: ఫ్లెక్సీలు పెట్టినందుకు మంత్రి తలసానికి రూ.50వేలు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలు విధించారు. దీంతో ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకోవడం లేదు. తాజాగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించారు.
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు, మైనంపల్లి రోహిత్‌కు రూ.40వేలు, మోర్తె క్లినిక్‌కు రూ.10వేలు, కె.నవీన్ కుమార్‌కు రూ.10వేలు, వేముల సంతోష్‌రెడ్డికి రూ.5వేలు, ఇ.శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు, కె.సాయిబాబాకు రూ.20వేలు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు రూ.10వేలు, దానం నాగేందర్‌కు రూ.5వేలు, మేయర్ విజయలక్ష్మికి రూ. 30వేలు జరిమానా విధిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఛలాన్లు వేశారు. అయితే ట్విట్టర్లో అందిన ఫిర్యాదుల ఆధారంగానే జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది. దీంతో తూతూ మంత్రంగానే జరిమానాలు విధించారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!