Site icon NTV Telugu

Hyderabad: ఫ్లెక్సీలు పెట్టినందుకు మంత్రి తలసానికి రూ.50వేలు జరిమానా

Trs Flexi

Trs Flexi

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలు విధించారు. దీంతో ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకోవడం లేదు. తాజాగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించారు.

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు, మైనంపల్లి రోహిత్‌కు రూ.40వేలు, మోర్తె క్లినిక్‌కు రూ.10వేలు, కె.నవీన్ కుమార్‌కు రూ.10వేలు, వేముల సంతోష్‌రెడ్డికి రూ.5వేలు, ఇ.శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు, కె.సాయిబాబాకు రూ.20వేలు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు రూ.10వేలు, దానం నాగేందర్‌కు రూ.5వేలు, మేయర్ విజయలక్ష్మికి రూ. 30వేలు  జరిమానా విధిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఛలాన్‌లు వేశారు. అయితే ట్విట్టర్‌లో అందిన ఫిర్యాదుల ఆధారంగానే జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది. దీంతో తూతూ మంత్రంగానే జరిమానాలు విధించారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పష్టం చేశారు.

Patnam Mahender Reddy: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీపై కేసు నమోదు

Exit mobile version