Site icon NTV Telugu

GHMC : జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల

Ghmc

Ghmc

GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా పౌర సేవలను వేగవంతం చేసే ఉద్దేశంతో జిహెచ్ఎంసి డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నూతన సంస్కరణల ప్రకారం భాగ్యనగరంలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

కేవలం డివిజన్ల సంఖ్యనే కాకుండా, పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు , 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజగిరి, శంషాబాద్, గోల్కొండ , రాజేంద్రనగర్ ప్రాంతాలు కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా వార్డు స్థాయి కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు, ప్రస్తుత సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

JC Prabhakar Reddy: ఒక రైతుగా జిల్లా కలెక్టర్ను కలిశా.. దీన్ని రాజకీయం చేయొద్దండి

ఈ పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని, ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రజల నుండి సుమారు 6,000కు పైగా అభ్యంతరాలు రాగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతనంగా ఏర్పాటైన 12 జోన్లకు పాలనా సారథులుగా ప్రభుత్వం సమర్థులైన అధికారులను కమిషనర్లుగా నియమించింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవరావు, కూకట్‌పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్‌కు సందీప్ సుల్తానియా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అదేవిధంగా చార్మినార్ జోన్‌కు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, మల్కాజగిరికి సంచిత్ గంగ్వార్, ఎల్బీ నగర్‌కు హేమంత్ కేశవ్ పాటిల్ నియమితులయ్యారు. ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా రాధిక గుప్త, సికింద్రాబాద్‌కు రవికిరణ్ , గోల్కొండ జోన్‌కు ముకుంద రెడ్డిలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్లవాత్మక మార్పుల ద్వారా నగర పాలన నేరుగా ప్రజల ముంగిటకే వెళ్తుందని, మౌలిక సదుపాయాల కల్పన ,ల పరిష్కారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!

Exit mobile version