NTV Telugu Site icon

Adilabad: తెల్ల పేపర్లను కరెన్సీగా మారుస్తామంటూ ఘరానా మోసం.. నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Adilabad Gang Arrest

Adilabad Gang Arrest

Adilabad Crime News: కరెన్సీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తెల్ల పేపర్లను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులకు చెందిన ముఠాను ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీసు అరెస్టు చేశారు. వారిలో ఓ మహిళ కూాడా ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితల వద్ద రెండు లక్షల పదివేల నగదు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాజం పేటకు జంగుకు వద్ద రూ. 5 లక్షలు తీసుకుని ఈ ముఠా టోకరా పెట్టింది.

Also Read: Minister Shivanand Patil: రైతులపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు.. ‘పరిహారం కోసమే ఆత్మహత్యలు..!’

రూ. 5 లక్షలు ఇస్తే కోటీ రూపాయలు చేస్తామంటూ అతడికి ఆశ చూపించింది. అతడిని నమ్మించేకు ముందుగా మూడు వంద నోట్లను కెమికల్ కలిపి ఆసలు వి చూపించింది. దీంతో ఈ ముఠాను నమ్మిన జంగు మొదట మూడు లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత అతడిని మరో రూ. 7 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు జంగు పోలీసలను ఆశ్రయించగా అసలు విషయం బట్టబయలైంది. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు ఈ ముఠాకు చెందిన నలుగురిన అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. రెండు లక్ష పదివేలు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Toilet remark row: “సౌత్ ఇండియన్స్ నల్లగా ఉంటారు”.. బీజేపీ నేత పాత వీడియోని పోస్ట్ చేసిన డీఎంకే..

Show comments