Ganesh Navaratri : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని సూచించారు.
మండపాల ఏర్పాట్లలో తప్పనిసరి నిబంధనలు
మండపాల కోసం ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలి: https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
విద్యుత్ కనెక్షన్లకు అధికారుల అనుమతి తప్పనిసరి.
మండపాల నిర్మాణ పనులు నిపుణులకే అప్పగించాలి.
రోడ్లు పూర్తిగా బ్లాక్ చేయరాదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
డీజేలకు నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడరాదు.
మైక్ సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనలలోపే ఉండాలి.
సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి.
వర్షాలను దృష్టిలో ఉంచుకొని మండపాలు నిర్మించాలి.
భక్తుల తాకిడికి తగ్గట్టుగా క్యూలైన్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహన పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి.
పాయింట్ బుక్ లో నిర్వాహక కమిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
విగ్రహ నిమజ్జనం ప్రభుత్వం సూచించిన అధికారిక స్థలాల్లోనే జరగాలి.
నవరాత్రి మండపాలపై ప్రత్యేక సూచనలు
అగ్నిప్రమాదాలకు దారి తీసే వస్తువులను మండపాల వద్ద ఉంచరాదు.
విద్యుత్ వైర్లను పిల్లలకు అందకుండా సేఫ్‌గా అమర్చాలి.
వాలంటీర్లకు ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి.
రాత్రిపూట కూడా వాలంటీర్లు విధుల్లో ఉండాలి.
తనిఖీ చేసిన తర్వాతే భక్తులను మండపాల్లోకి అనుమతించాలి.
ఉత్సవ నిర్వాహకులకు సూచనలు
మండపాల్లో టపాకాయలు, మందుగుండు సామగ్రి ఉంచరాదు.
ఎమర్జెన్సీ లైట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
జనరేటర్ వాడితే, ఇంధనాన్ని మండపానికి దూరంగా నిల్వ చేయాలి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలి.
ఆస్పత్రులు, విద్యాసంస్థలకు దగ్గరలో ఉన్న మండపాలు సౌండ్ సిస్టమ్ నిబంధనలు పాటించాలి.
నిమజ్జనం కోసం పోలీసులు సూచించిన మార్గాలనే వినియోగించాలి.
విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో విగ్రహాలు తరలించరాదు.
రద్దీ తక్కువగా ఉన్న సమయంలోనే తరలించాలి.
భారీ విగ్రహాలను చిన్న వాహనాల్లో తరలించరాదు.
నిపుణులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలి.
విద్యుత్ వైర్ల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
భారీ విగ్రహాల తరలింపులో క్రేన్‌లను వినియోగించాలి.
పిల్లలను విగ్రహాల తరలింపుకు తీసుకెళ్లరాదు.
