Hyderabad Rains: హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తాయి. మూడురోజులుగా కురుస్తున్న భారీ వానలకు కాలనీలు ఏరులై పారుతున్నాయి. వానలకు హైదరాబాద్ లోని గాజుల రామారం నీట మునిగి జన జీవనం అతలాకుతలమైంది. త్రాగడానికి నీళ్ళు లేవు కనీసం కరెంట్ లేదని, అధికారులు స్పందించాలి మా సమస్య పరిష్కరించాలని గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీ వాసులు వేడుకుంటున్నారు. వర్షం పడితే గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీలో దయనీయ పరిస్తితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్లు ఎవరు లేరని కన్నీరుమున్నీరయ్యారు. రెండు రోజుల నుంచి నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. త్రాగడానికి నీళ్ళు లేక, కనీసం కరెంట్ లేదని వాపోయారు. మేము.. మా పిల్లాపాపలు.. ఇంట్లో వాళ్ళం, వృద్దులు, పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని తెలిపారు. మూడు రోజుల నుండి ఓక్షిత్ ఎంక్లివ్ కాలనీ బాలాజీ లైన్ గాజూలరామారం రోడ్డు పై వరద నీరు ప్రవహించడం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు. ఎప్పుడు వర్షాలు పడినా ఇదే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Health Tip: మందు తాగుతారా? అయితే ఈ కూరగాయ రసం తాగండి అంతా సెట్ అయిపోతుంది
ఎంతమంది అధికారులకు చెప్పినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ మెంట్స్ కాలనీ లో వరద నీరు వచ్చి చేరిందని దీని వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని అన్నారు. మా లే అవుట్ రూట్ లో డే అండ్ నైట్ రాకపోకలు నిలిచి పోయాయని అన్నారు. సూరారం & కపల చెరువు నుండి భారీగా నీరు దిగువున చేరడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీలో అండర్ నాలా సంక్షన్ అయింది కానీ ఇంకా పనులు స్టార్ట్ కాలేదని, ఇంకా ఏడాది ఈ సమస్య ఇలాగే ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి కాలనీలో అండర్ నాలా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక మహిళలు, వాహనదారులు, అపార్ట్ మెంట్ వాసులు వేడుకుంటున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్