Site icon NTV Telugu

Gaddar : ఎర్ర మందారం కలర్‌ మారుతుందా..?

Gaddar

Gaddar

ప్రజా గాయకుడు గద్దర్‌ అంటే తెలియనివారుండరు.. ఆయనో కరుడుగట్టిన కమ్యూనిస్టు అనిది నిన్నటి మాట.. ఇప్పుడా ఎర్రమందారం కాస్తా.. కలర్‌ మారబోతుందా? అనే చర్చ సాగుతోంది.. ఆయన ఈ మధ్య తరచూ వివిధ పార్టీల నేతలను కలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఈ కామ్రేడ్‌.. ఏ పార్టీ కండువైనా కప్పుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలను కూడా కలుస్తూ వచ్చారు గద్దర్.. అంతేకాదు.. నరేంద్ర మోడీ సర్కార్‌ ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలంటూ కొత్త డిమాండ్‌తో పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడిపోయారు.. ఇక, ఈ మధ్య తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను రెండుసార్లు కలిశారు గద్దర్‌.. అంతేకాదు.. పరేడ్‌ గ్రౌండ్స్ వేదికగా బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు కూడా ఆయన హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న గద్దర.. కాషాయం పార్టీలో చేరతారా? అనే కొత్త చర్చ మొదలైంది. అన్ని కలసి వస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన దిగడం ఖాయంటున్నారు విశ్లేషకులు..

Read Also: Etela Rajender: బోర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదు

మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో జన్మించిన ఆయన.. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు.. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత క్రమంగా ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.. ఎందరినో ఉత్సాహపరిచారు.. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఇక, 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది.

అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసారు. అయన కెనర బ్యాంకులో క్లార్క్ గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు.. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి.. 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. అయితే.. 1997 ఏప్రిల్ 6 న ఆయనపై కాల్పులు జరిగాయి.. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేకపోయారు.. ఆ తర్వాత విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరిస్తూ వచ్చారు.. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు.. మరి, గద్దర ఏ పార్టీలో చేరతారు? పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు నినాదం వెనుక ఆయన ప్లాన్‌ ఏంటి? అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే.

Exit mobile version