Gadchiroli Encounter: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు నేత ప్రభాకర్ హతం.!
- గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు, ఏడుగురు మృతి
- ఎన్‌కౌంటర్‌లో కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతి
- మావోయిస్టు ప్రభాకర్‌పై రూ.50లక్షల రివార్డు
- గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతిగా ఉన్న మావోయిస్టు ప్రభాకర్
- ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు మృతి, మరొకరికి గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి అడవుల్లో గత మూడు రోజులుగా జరుగుతున్న భారీ ఆపరేషన్ ముగిసింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ కీలక నేత ప్రభాకర్‌తో సహా మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఈ పోరులో ఒక జవాన్ వీరమరణం పొందగా, మరొకరు గాయపడ్డారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రభాకర్. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నివాసి అయిన ఈయన, సీపీఐ మావోయిస్టు సంస్థలో గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్‌చార్జ్, వెస్ట్ సబ్-జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్ , కంపెనీ నంబర్ 10 ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాకర్‌పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందంటే ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
Mega Trade Deal: ఈయూ, యూఎస్ తర్వాత.. మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..
గత మూడు రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి నాటికి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈరోజు సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా సంఘటనా స్థలం నుండి మరో నలుగురి (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మృతదేహాలను వెలికితీశారు. మొత్తంగా ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు (నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 03 AK-47 రైఫిళ్లు, 01 SLR రైఫిల్,
01 .303 రైఫిల్ ఉన్నాయి.
ఈ ఆపరేషన్ లో సీ-60 స్క్వాడ్ జవాన్ దీపక్ చిన్న మాదవి (38) అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. అహేరి నివాసి అయిన దీపక్, నిన్న సాయంత్రం జరిగిన భీకర పోరాటంలో ఒంటరిగా ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు. అయితే, ఎదురుకాల్పుల్లో బుల్లెట్ తగిలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హెలికాప్టర్ ద్వారా భమ్రాగడ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రేపు దీపక్ స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరోవైపు, కిష్ట్యాపల్లి నివాసి అయిన జోగా మాదవి అనే జవాన్ కూడా కాల్పుల్లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గడ్చిరోలిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అధికారులు తెలిపారు. మరణించిన మిగిలిన మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను, మరణించిన వారి వివరాలను గడ్చిరోలి పోలీసులు రేపు నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!