Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- దేవదుర్గలో బంగారం, రాగి అన్వేషణకు శ్రీకారం
- సింగరేణికి దక్కిన ఎక్స్‌ప్లోరేషన్ హక్కులతో పనులు
- మైనింగ్ ప్రాజెక్టుతో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు
- సైట్ ఆఫీస్, హెలిప్యాడ్ ఏర్పాటుకు భట్టి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా, దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించి, ఖనిజ అన్వేషణ ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. 136 సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ్ బ్లాక్ ఎక్స్‌ప్లోరేషన్ హక్కులను దక్కించుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దక్కడంతో పాటు ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
పనుల పర్యవేక్షణ వేగవంతం చేసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక సైట్ ఆఫీస్‌ను, హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య విడదీయరాని సాంస్కృతిక బంధం ఉందని, స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును విజయవంతం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేద్దామని కోరారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ, గతంలో తాను ఇక్కడ సీఐగా పనిచేశానని, ఇప్పుడు సింగరేణి అధినేతగా బంగారు, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు లింగదహళ్ళి చేరుకున్న భట్టి విక్రమార్కకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, ఆయన లింగదహళ్ళిలోని చారిత్రక శ్రీ పరమానంద శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..