Site icon NTV Telugu

Formula ERace : ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు..

Ktr

Ktr

Formula ERace : ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని అంశాల ఆధారంగా, అప్పటి మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురిపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అనుమతి కోరింది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్‌మీట్‌లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్

ఈ కేసులో ఏసీబీ, అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అలాగే, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఐదు సార్లు విచారించి వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. వీరితో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆర్గనైజర్లను (FEOలు) కూడా విచారించినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో (ఎవరో ఒకరు ఏదో ఇస్తే, దానికి ప్రతిఫలంగా మరొకరు వారికి ఏదో ఇవ్వడం) జరిగిందని నిర్ధారించినట్లు సమాచారం. ఈ రేసుకు స్పాన్సర్‌గా ఉన్న కంపెనీ, అప్పటి అధికార పార్టీకి రూ. 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.

ఈ లావాదేవీలు క్విడ్ ప్రో కోకు నిదర్శనమని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఏసీబీ తమ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్‌తో న్యాయ సలహా తీసుకున్న ప్రభుత్వం, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్ సహా నిందితులపై ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేస్తుంది. ఈ కేసులో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదికను గవర్నర్‌కు కూడా ఏసీబీ అందజేసినట్లు సమాచారం.

Bhadrakali : విజయ్ ఆంటోనీ భద్రకాళి ట్రైలర్ రిలీజ్..

Exit mobile version