Bhaskara Rao Passed Away: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhaskara Rao Passed Away: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కర్ రావు (94) సోమవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భాస్కర్ రావు ప్రస్తుతం ఉప్పల్ తూర్పు కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత 1963లో న్యాయవాద వృత్తిని చేపట్టి.. దేవరకొండ, నల్గొండలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.
1981లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసి.. జిల్లా జడ్జిగా, జాయింట్ హైకోర్టు రిజిస్ట్రార్‌గా రాజమండ్రి, శ్రీకాకుళం, సికింద్రాబాద్‌లలో పనిచేశారు. 1995లో అడిషనల్ జడ్జిగా, 1997లో పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు.1999లో హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం కమిటీ ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. జస్టిస్ భాస్కర్ రావు అంత్యక్రియలు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Same Gender Marriage: నేడే స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!
Also Read
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!