NTV Telugu Site icon

Food safety: కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన వైద్యారోగ్య శాఖ..

Telangana

Telangana

Food safety: టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ స్పందించింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పందిస్తూ.. దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంతో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పింది. నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తున్నామని అధికారులు చెప్పారు. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ లాబ్స్ లను త్వరలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్ట్రీట్ వెండర్లు కు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు లు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని, హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీ పై రాష్ట్ర సచివాలయం లో అవగాహన సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పని సరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లు లను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహించి Fssai లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Read Also: Viral news: 500 ఏళ్ల నాటి “ఏనుగు పాదం”గా పిచితే చింత చెట్టు..ఎక్కడ ఉందో తెలుసా?

ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నామని, ఆహార కల్తీ చేసే సంస్థల లైసెన్స్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు చెప్పారు. ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తుందని కమీషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.

అంతకుముందు కేటీఆర్.. రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు. మొత్తానికి కాంగ్రెసోళ్లు వ‌చ్చి, పెద్ద‌మార్పే తెచ్చారు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం హాస్ట‌ళ్లలో నెల‌కొన్న దుస్థితిపై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప‌దేండ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో పురుగుల అన్నం, నీళ్ల చారు క‌నిపించేవి. నేటి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అల్పాహారంలో బ‌ల్లులు, చ‌ట్నీల్లో చిట్టెలుక‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.