Janagama: జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని దారుణం చోటుచేసుకుంది. పెంబర్తి లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. అయితే రోజూలాగానే సాయంత్రం విద్యార్థినులు తినడానికి వెళ్లారు. అక్కడ పాఠశాల సిబ్బంది విద్యార్థినులకు బెండకాయలు, సాంబారు, పెరుగుతో భోజనం చేశారు. అప్పటి వరకు బాగానే వున్న విద్యార్థినిలకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే ఐదుగురు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రావడం మొదలయ్యాయి. దీంతో విద్యార్థినులు కడుపునొప్పితో ఆర్తనాదాలు చేశారు.
Read also: Brave Women: దోపిడీ దొంగలు తుపాకీతో బెదిరించినా ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. చివరికి..?
రాత్రి నుంచి విద్యార్థినులకు వాంతులు, కడుపునొప్పి తగ్గకపోవడంతో యాజమాన్యం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇంతలో మరో ముగ్గురికి అదే జరగడంతో పసరమడ్ల మాతాశిశు దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 3 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. విద్యార్థినులు మాత్రం నీరసంగా అయ్యారని వారికి సరైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే యాజమాన్యం మాత్రం అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రుకుల ఇప్పటి వరకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలను గురుకుల యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తకుండా సైలెంగా ఉంన్నారు. మరి ఈ ఘటనపై ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. ఈఘటనపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది?
Gold Price Today: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?