Children Drown: ఫంక్షన్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Five Children And A Man Drown In Medchal Malkaram Lake: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌లో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈత కొట్టేందుకు ఆరుగురు చిన్నారులు వెళ్లగా.. వారిలో ఐదుమంది మృతి చెందారు. వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ ఆటో డ్రైవర్ సైతం చెరువులో మునిగి మరణించాడు. జవహర్‌నగర్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు ఒక కుటుంబం హాజరయ్యింది. ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు.. పక్కనే ఉన్న చెరువు కనబడగానే, సరదాగా ఆడుకుందామని వెళ్లారు. అయితే.. ఈత రాకపోవడంతో ఐదుగురు పిల్లలు దుర్మరణం చెందారు. వీరికి కాపాడేందుకు అదే కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ చెరువులో దూకగా.. ఆయన కూడా మృతి చెందాడు. ఒక అబ్బాయిని మాత్రం స్థానికులు కాపాడారు.
మృతి చెందిన పిల్లల వయసు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే.. క్షేమంగా బయటపడ్డ అబ్బాయిని, చికిత్సం నిమిత్తం దగ్గరలోనే ఆసుపత్రికి చేర్పించారు. మృతి చెందిన వారంతా.. అంబర్‌పేట్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఏసీపీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు విగతజీవులుగా తిరిగి రావడంతో.. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో తమకు ఆసరాగా ఉంటారనుకున్న పిల్లలు ఇప్పుడు లేరన్న విషయం తెలిసి రోదిస్తున్నారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!