Fisherman Fights For Fishes: ఈ చెరువునుంచి ఆ.. చెరువులోకి చేపలు.. ఘర్షణకు దిగిన మత్సకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలు వేరు, రెవెన్యూ డివిజన్లు వేరు, మండలాలు కూడా వేరు, ఆ రెండు గ్రామాల మధ్య విస్తరించి. ఒకే ఒక్క చెరువు, చేపలు పట్టే హక్కు మాత్రం ఒకే ఊరి మత్స్యకారులకు సొంతం. కాగా.. కళ్ల ఎదుట కళకళలాడుతున్న చెరువు, చెంగున దుంకుతున్న చేపలు కనిపిస్తున్నా ఆదాయం దక్కకపోవడంతో ఒక ఊరి బెస్తలు ఉసూరు మంటున్నారు. ఈ నేపథ్యంలో.. చెరువు రెండు పంచాయతీల పరిధిలో విస్తరించినా చేపలు పట్టే హక్కు ఒకే గ్రామం వారికి ఉండడం వివాదానికి దారితీసింది.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సాన్‌పల్లి పంచాయతీలో ఆ ఊరితో పాటు శేరి మల్లారెడిపల్లి మధిర గ్రామం ఉన్నాయి. మెదక్ జిల్లాలో రికార్డుల్లో గడిపెద్దాపూర్ పెద్ద చెరువుగా నమోదు చేయబడింది. ఒకే చెరువు అయినా రికార్డుల్లో రెండు వేర్వేరు పేర్లతో కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. నీటి వినియోగదారుల సంఘం ఒక్కటే.. కానీ.. శిఖం భూమి ఎక్కువగా ఉండటంతో ఆయకట్టు సంఘంలో కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన సభ్యులదే మెజార్టీ. దీంతో.. రెండున్నర దశాబ్దాల క్రితం ఈ చెరువులో చేపలు పెంచేందుకు మత్స్యసహకార సంఘం ఏర్పాటైంది. అయితే.. అప్పట్లో కన్‌సాన్‌పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి గ్రామాల మత్స్యకారులు సభ్యత్వ రుసుము చెల్లించలేక సభ్యత్వం తీసుకోలేదు. ఈనేపథ్యంలో.. సంఘంలో కేవలం గడిపెద్దాపూర్ మత్స్యకారులే సభ్యులుగా చేరారు. దీంతో గడిపెద్దాపూర్ మత్స్యసహకార సంఘంగా నమోదైంది. అయితే..చెరువులో ప్రతీ సంవత్సరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుస్తున్నారు. కానీ చేపలు పట్టుకునే సమయంలో గొడవులు జరుగుతున్నాయి.
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
read also: Rohit – Dhawan: మరో అరుదైన ఫీట్.. రెండో స్థానం సొంతం
ఈనేపథ్యంలో.. చెరువు శిఖంలో మూడొంతులు మా గ్రామానికే చెందడంతో తమకూ వాటా ఉంటుందని కన్‌సాన్‌పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి గ్రామాల మత్స్యకారులు విధించడం వివాదాలకు దారితీస్తున్నది. దీంతో..మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం లేకపోవడంతో ఆ గ్రామాలవారికి చేపలు పట్టే అధికారం ఉండదని గడిపెద్దాపూర్ మత్స్యకారుల వాదన. కాగా.. ఇరవయ్యేళ్లుగా ప్రతీయేటా చేపల పంచాయితీ జరుగుతున్నది. కన్‌సాన్‌పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి మత్స్యకారులు చేపలు పట్టడం కోసం వేళ్తే వారిని గడిపెద్దాపూర్ వాసులు చితకబాదడం.. గడిపెద్దాపూర్ మత్స్యకారులు ఇటువైపు వచ్చి చేపలు పడుతుంటే కన్‌సాన్‌పల్లి వాసులు దాడులు చేయడం తరచుగా జరుగుతుంది. కన్‌సాన్‌పల్లి గ్రామ మత్స్యకారులు చెరువులో తమ గ్రామ పరిధి వరకు స్తంభాలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా గడిపెద్దాపూర్ మత్స్యకారులు విరగకొట్టారు. ఈనేపథ్యంలో.. రెండు గ్రామాల మధ్య కక్ష్యలు పెరుగుతుంది. అంతేకాకుండా.. ఈ చెరువులోకి త్వరలో సింగూరు జలాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో గొడవలు పెరిగే అవకాశం ఉన్నది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకముందే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రెండు గ్రామస్తులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!