Site icon NTV Telugu

Firing on Telangana Police in Bihar: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు

Firing On Telangana Police In Bihar

Firing On Telangana Police In Bihar

Firing on Telangana Police in Bihar: బీహార్‌ లో తెలంగాన పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు ఘటన కలకలం రేపింది. బీహార్‌, కోల్కత్తాలో వాహనాల డీలర్‌ షిప్‌ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు బీహార్‌ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు. భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. అయితే పోలీసులు, నిందితుల కాల్పుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని నలుగురిని అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

వివరాల్లోకి వెళితే.. కూకట్‌ పల్లికి చెందిన ఓ వ్యాపారి కార్ల డీలర్‌ షిప్‌ కోసం ఇంటెర్నట్‌ లో సెర్చ్‌ చేసి, ఓ నకిలీ వెబ్‌ సైట్‌ లో డీలర్‌ షిప్‌ కోసం ఇంటర్నెట్‌ లో సెర్చ్‌ చేసి, ఓ నకిలీ వెబ్‌ సైట్‌ లో డీలర్‌ షిప్‌ కావాలంటూ వివరాలు ఇవ్వడంతో.. నిజామాబాద్‌ లో డీలర్‌ షిప్‌ ఓకే అయ్యిందంటూ రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ. 2, 65వేలు చెల్లించాలంటూ బ్యాంకు అకౌంట్‌ డీటెయిల్స్ పంపించారు. దీంతో.. నిజమని భావించిన బాధితుడు జులై 7వ తేదీన రిజిస్ట్రేషన్ ఫీజు కోసం పలు దఫాలుగా మొత్తం రూ.28,58,500ను నిందితుడి నుంచి దోచుకున్నారు. అయినాకూడా.. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ ఫోన్లు చేస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితుడు 2022 జులై 16వ తేదీన సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు సేకరించిన పోలీసులు నిందితుల కోసం నవాదా జిల్లా భవానీబిఘా వెళ్లారు. దీంతో గమనించిన సైబర్ నేరగాళ్లు.. పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈనేపథ్యంలో.. పోలీసులు నిందుతుల కాల్పుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారని, ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. అయితే.. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి రూ.1కోటి 23 లక్షల రూపాయల నగదు, 2 కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు ఏపీ, తెలంగాణతో పాటు పట్నా, కోల్ కత్తా నగరాల్లో పలువురిని వాహర డీలర్ షిప్ పేరుతో మోసగించినట్లు పోలీసులు తెలిపారు.
Astrology : ఆగస్టు 15, సోమవారం దినఫలాలు

Exit mobile version