NTV Telugu Site icon

Hyderabad: బావర్చి హోటల్ లో అగ్ని ప్రమాదం

Green Bavarchi

Green Bavarchi

నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఐమాక్‌ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల ఎగిసిపడుతుండటంతో.. బిల్డింగ్ అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 14 మంది చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు క్రైన్ సహాయంతో వారిని సురక్షితంగా ర‌క్షించారు.

ఎన్టీవీ తో పైర్ ఆఫీసర్, మాదాపూర్ ఏసీపీ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. వెంటనే ఫైరింజన్లు సంఘటనా స్థలానికి పంపించామని తెలిపారు. దాదాపు 14 మంది ప్రాణాలు కాపాడుకోవడానికి పై అంతస్తుకు చేరుకున్నారని వివరించారు.

వెంటనే బ్రాంటోను ఘటన స్థలానికి రప్పించామని, బ్రాంట్ ద్వారా 14 మందిని రక్షించామని తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. నాలుగంతస్తుల బిల్డింగ్ కు ఎగ్జిట్ కి సంబంధించిన దారి లేకపోవడంతో వాళ్ళు అంత పైకివెళ్లారని వివరించారు. ఈఘటన ఎలా సంభవించింది. అనే దానికిపై అధికారులకు ఇంకా స్పష్టటత రాలేదని, వాటి గురించి ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. షాక్ షర్య్కూట్ వల్ల లేదా మరే ఇతర కారణాల అనేది విచారిస్తున్నట్లు వివరించారు.

బిల్డింగ్ ఒక్కసారిగా మంటలు చలరేగటంతో ప్రజలు భయంతో పరుగులు తీసారు. కాసేపు అక్కడ ఏం జరుగతుందో అయోమయంలో పడిపోయారు. సెకండ్ , థార్డ్ ఫ్లోర్ లలో ఐటీ ఆఫీస్, నాలుగో అంతస్తులో సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో దట్టమైన మంటలు వ్యాపించడంలో బిల్డింగ్ అంతా పొగకమ్ముకుపోయింది. బిల్డింగ్ నుంచి కాపాడంటూ కేకలు వినిపించడంతో క్రేన్ సహాయంతో సహాయక చర్యలు మొదలు పెట్టారు పోలీసులు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Errabelli Dayakar Rao: ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు