Fire accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire accident: స్వప్రలోక్ ఘటన మరువక ముందే.. హైదరాబాద్ అబిడ్స్‌లో మరో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయభ్రాంతులైన కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తీగా అదుపుచేశారు. ఈప్రమాదంలో దాదాపు ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఐదుకార్లలో ఒకకారులో సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయాడు. అందులో కూడా మంటలు అంటుకోవడంతో సెక్యూరిటీ గార్డ్ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. కారులో సజీవ దహనమైన సెక్యూరిటీ గార్డ్ సంతోష్ గా గుర్తించారు పోలీసులు. ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. సెక్యూరిటీ గార్డ్ సంతోష్ కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. అబిడ్స్‌లో ఉదయం చెప్పులు కుట్టడం, రాత్రి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.
Read also: Child Marriage: బాల్యవివాహం కలకలం.. సాయిబాబా గుట్టు రట్టు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
రోజు మాదిరిగానే నిన్న ఉదయం ఇంట్లోంచి ఉద్యోగానికి వెళ్ళిన సంతోష్ చెప్పులు దుకాణంలో విధులు ముగించుకొని కార్ల గ్యారేజ్ లో డ్యూటీకి వచ్చాడు. రాత్రి భోజనం చేసిన తరువాత పన్నెండు గంటలకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తిన్నానని పడుకుంటున్నాని తల్లికి చెప్పి సంతోష్ కారులో నిద్రించాడు. ఉదయం సంతోష్ చనిపోయాడని ఫోన్ చేసి చెప్పడంతో గ్యారేజ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాను కుటుంబ సభ్యులు. ఈ మధ్యనే సంతోష్ అన్న చనిపోయాడని ఇప్పుడు చిన్న కొడుకు కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కుగా వుండి పోషిస్తూ వస్తున్న సంతోష్ కూడా చనిపోయాడని ఇక మాకు దిక్కెవరని వాపోయారు. సంతోష్ కుటుంబ సభ్యుల రోదనలు విని స్థానికులు చలించిపోయారు. అయితే.. కామినేని హాస్పిటల్ కి అనుకునే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లను తరలించేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా.. ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ దుస్థితి.. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బుల్లేవు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు