Hyderabad: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. పిల్లలను కాపాడాల్సిన తండ్రులు కామాంధులుగా మారి పశువుల్లా కన్నబిడ్డల జీవితాలను ఛిద్రం చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి దారుణ ఘటనే హైదరాబాద్ జీడిమెట్లలో చోటుచేసుకుంది.
Read also: Mangalavaaram: నెక్లస్ రోడ్ లో “మంగళవారం” స్పెషల్ వాల్ పెయింటింగ్…
హైదరాబాద్ జీడిమెట్ల లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఓ తండ్రి కన్న బిడ్డపై గత కొన్నాళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కాగా తండ్రి చేస్తున్న పనికి రోజూ నరకయాతన భరిస్తూ వచ్చింది ఆ యువతి. కాళ్లు పట్టుకుని వద్దని బతిమలాడి కూతురిపై జాలికూడా చూపించలేదు ఆ కసాయి తండ్రి. బాలికపై అత్యాచారానికి పాల్పడుతూనే వచ్చాడు. అయితే ఈ విషయం ఎక్కడ తన తల్లికి తెలిస్తే ఏమవుతుందో ఏమో అనుకుందో ఏమో ఆ యువతి.. అత్యాచార ఘటనపై చెప్పలేకపోయింది. చివరకు తండ్రి కామవాంఛకు విసిగిపోయిన కూతురు తల్లితో చెప్పింది. విషయం విన్న తల్లి లో స్పందన లేకపోవడంతో కూతురు ఆశ్చర్యపోయింది. అయితే తండ్రి తనపై చేస్తున్న అఘాయిత్యం తల్లికి తెలిసే చేస్తున్నాడని గ్రహించింది. తండ్రి చేస్తున్న బాధను భరిస్తూ వచ్చిన ఆ యువతికి ఇన్స్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతనిని పూర్తిగా నమ్మిన బాధిత యువతి, యువకుడితో తండ్రి చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో ఇదే అలుసుగా భావించిన ఆ యువకుడు ఆమెను నేను వున్నానని నమ్మించాడు. ఏ బాధ లేకుండా ఆయువకుడు చూసుకుంటానని నమ్మించాడు. తనతో బయటకు రావాలని కోరాడు. అతనిని పూర్తీగా నమ్మిన ఆ యువతి ఆ యువకుడితో బయటకు వెళ్లింది. సికింద్రాబాద్ లోని రూముకి తీసుకువెళ్లాడు. ఇక్కడ ఎవరూ లేరని నువ్వు భయపడాల్సిన అవసరం లేదని నమ్మించాడు.
Read also: Guntur Kaaram: రన్ టైమ్ కి కూడా భయపడుతున్నారు ఏంట్రా బాబు… ఆ కుర్చీని మడతపెట్టి…
దీంతో ఆ బాలిక యువతి సరే అని అతనితో ఉండటంతో బాలికపై ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చానని చెప్పినా నీ తండ్రే నీపై అత్యాచారం చేశాడు నేను చేస్తే తప్పా అంటూ ఆమెకు చిత్రహింసలు పెట్టాడు. రెండు రోజులు గదిలో బంధించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అతను లేని సమయంలో ఆ బాధిత యువతి అక్కడి నుంచి తప్పించుకుని మరొకరిని ఆశ్రయించింది. స్పందించిన స్థానికులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, ఆ యువకుడిని అదుపులో తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అటు తండ్రి, ఇటు నమ్మిన యువకుడు ఆమెను చిత్ర హింసలు చేసి తనపై అత్యాచారం చేయడంతో ఆ బాలిక కుంగిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని బోరున ఏడ్చింది. అయితే తన సొంత తండ్రే ఆ యువతిని అత్యాచారం చేశాడా? లేక ఇంకా ఏదైనా ఉందా? మరి ఆ యువకుడు ఎవరు? తనతో అంత పరిచయం ఎందుకు చేసింది? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. తండ్రి చేసిన అఘాయిత్యం పై ఆ యువతి ఎందుకు చెప్పలేదు? యువకుడిపైనే కేసు పెట్టడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.
Pregnancy termination: భర్త మరణంతో కుంగిపోయిన భార్య.. 27 వారాల గర్భం రద్దుకు హైకోర్టు అనుమతి..