NTV Telugu Site icon

Revanth Reddy: మే 21 నుంచి రైతు రచ్చ బండ..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచుతోంది.. రాహుల్‌ గాంధీ పర్యటన తర్వాత వరుస కార్యక్రమాలు చేపడుతోంది.. వరంగల్‌ వేదికగా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు రైతు డిక్లరేషన్‌ణు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్లాన్‌ చేస్తోంది.. అందులో భాగంగా.. మే 21 నుండి జూన్ 21 వరకు రైతు రచ్చ బండ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ప్రతి పోలింగ్ బూత్‌లో కరపత్రాలు, ఫ్లెక్సీలు పెడతాం.. రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పిస్తాం అన్నారు. 400 మంది ముఖ్య నాయకులను గుర్తించాం, ప్రతి నాయకుడు 40 గ్రామ పంచాయతీలలో రచ్చ బండ నిర్వహించాలి.. ప్రతీ నాయకుడు గ్రామాల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. డీసీసీలు సమావేశాలు నిర్వహించి గ్రామాలకు వెళ్లి కార్యాచరణలో పాల్గొనాలన్న ఆయన.. జూన్ 2న ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేసి రైతు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు.

Read Also: Karate Kalyani: కరాటే కల్యాణ్‌ కిడ్నాప్‌! ఇలా స్పందించిన ఆమె సోదరుడు..

ప్రతి మండల, జిల్లా, బూత్ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం.. కేసీఆర్‌ వచ్చిన తర్వతా వెలిసిన వైన్‌షాప్.. కల్లు దుకాణాల వద్దకూడా ఫ్లెక్సీలు పెడతాం, బెల్ట్ షాపులు దగ్గర కూడా ఫ్లెక్సీ, కేసీఆర్‌ తెరిచిన మందు బజార్ల దగ్గర పెడతాం.. నేనే వైన్‌ షాప్‌ దగ్గర ఫ్లెక్సీ పెట్టి కరపత్రాలు పంచుతానని తెలిపారు రేవంత్‌రెడ్డి. ఇక, పీసీసీ చీఫ్‌గా నేను జయశంకర్ సొంత ఊర్లో ఇల్లు ఇల్లు తిరిగి కరపత్రాలు పంచుతా.. రచ్చ బండ పెడతానని ప్రకటించారు. ప్రముఖుల గ్రామాల్లో రచ్చ బండలు పెడతాం.. ప్రతి రైతు గుండె తడతామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైతు బాగున్నారని తెలిపారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి..