నకిలీ వెబ్‌సైట్లు నయాగా తయారు చేసి ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్‌లో నకిలీదే ముందు కనిపిస్తుంది.