Rose Gold Beauty Parlour: పార్లర్ పేరుతో మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Rose Gold Beauty Parlour: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మోసం చేసి మూడు కోట్ల వసూళ్లు చేసి ఉడాయించారు కిలాడి దంపతులు. దీంతో ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెస్సికా కలిసి.. నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో కోసం యూ ట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునే విధింగా యాడ్స్ చేసి, ఎక్కువ డబ్బు వస్తుందని వారిని నమ్మించారు. ఆ యాడ్స్ చూసిన బాధితులు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ వారికి కాంటాక్ట్ అయ్యారు. వారి వలలో పడ్డ వారిని మిస్ అవకుండా రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ డబ్బుల వల వేశారు. దీంతో ఆ వలలో చిక్కుకున్న కస్టమర్లు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇరు నగరంలోనే కాదు.. జిల్లాల వారాగా పాకింది. బాధితులు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలు దంపతులు వసూలు చేసినట్లు సమాచారం. 100 కి పైగా పార్లర్లు ఓపెన్ చేసి మూడు కోట్లతో ఉడాయించినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35 వేలు జీతం ఇస్తామని దంపతులు సమీనా, ఇస్మాయిల్ నమ్మించారు. దీంతో దంపతుల మాయమాటలు నమ్మి కొందరు మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీని తీసుకున్నారు. రెండు మూడు నెలల పాటు జీతం ఇచ్చారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
Read also: Aadi Srinivas: సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం..!
జీతం ఇవ్వడానికి రేపు, మాపు అంటూ కాలం గడిపారు.. వస్తాయని ఆశతో వున్న కస్టమర్లకు నెల నెల నిరాశే ఎదురైంది. చివరకు జీతాల కోసం దంపతులకు కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన కస్టమర్లు షాక్ తిన్నారు. హెడ్ ఆఫీస్ కు తాళం వేసి ఉండటంతో లబోదిబో మన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని వాపోయారు. ఆ దంపతులను పట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులకోసం గాలింపు చేపట్టారు. గతంలో కామారెడ్డి జిల్లాలోను చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు వున్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారిని ఎలా నమ్ముతున్నారో అర్థకావడంలేదన్నారు. ఇప్పటి కైనా ప్రజలు ఇలాంటి వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
True lover : “ట్రూ లవర్”గా మారిన “గుడ్ నైట్” హీరో.. మరో బేబీ లోడింగ్
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!