NTV Telugu Site icon

Fake Baba: విక్రమార్కుడు సీన్ రిపీట్.. నరదిష్టి ఉందని నగలు కాజేశాడు

Fake Baba

Fake Baba

Fake Baba Caught By Hyderabad Police Who Stolen Mangalasutra:విక్రమార్కుడు సినిమాలో మాస్ మహారాజా రవితేజ దొంగ బాబా వేషం వేసుకొని, మహిళలను మోసం చేసే సన్నివేశం గుర్తుందా? తిరుపతి మొక్కు ఒకటి మిగిలిపోయిందని, తన దగ్గరున్న తిరుపతి కత్తితో గుండు గీయించుకుంటే లక్షలకు లక్షలు డబ్బులొస్తాయని నమ్మించి.. అరగుండు కొట్టి వెళ్లిపోతాడు. ఇలా అరగుండ్లు కొట్టి.. రవితేజ, బ్రహ్మానందం బాగా క్యాష్ చేసుకుంటారు. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే రియాలిటీలో జరిగింది. కాకపోతే.. ఇక్కడ ఈ దొంగ బాబా అరగుండు కాన్సెప్ట్ తప్ప, మిగతాదంతా ఫాలో అయ్యాడు. నరదిష్టి ఉందని మాయమాలు చెప్పి.. ఓ మహిళకు మత్తుమందు ఇచ్చి.. నగలు కాజేశాడు. చివరికి పోలీసుల చేతికి అడ్డంగా చిక్కాడు.

Attack on Police: శామీర్ పేట్, అల్వాల్ పోలీసులపై దాడి.. బొమ్మలరామారంలో ఘటన

ఆ వివరాల్లోకి వెళ్తే.. దొంగతనం చేయాలనే దురుద్దేశంతోనే దొంగ బాబా వేషం వేసిన ఓ వ్యక్తి, హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఇంద్రప్రస్థ కాలనీలో ఓ ఇంటిపై కన్నేశాడు. ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఆ ఇంటికి వెళ్లాడు. నరదిష్టి ఉందని మాయమాటలు చెప్పాడు. పాపం.. అతని మాటలు నమ్మిన ఆ మహిళ, అతడ్ని ఇంట్లోకి పిలిచింది. లోపలికి వెళ్లిన తర్వాత తాను శ్రీశైలం నుండి వచ్చానని కథలు అల్లాడు. ఈ క్రమంలోనే తనతో పాటు తెచ్చిన మత్తుమందుని ఆమెపై చల్లాడు. ఆమె మత్తులోకి జారుకొని కింద పడిపోగానే.. మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లాడు. మత్తు నుంచి కోలుకున్న తర్వాత తన మెడలో మంగళసూత్రం లేకపోవడాన్ని ఆ మహిళ గమనించింది. దీంతో ఆ దొంగ బాబా మోసం చేశాడని గ్రహించి, ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.

Rajinikanth: సీరియస్ వార్నింగ్.. రజినీకాంత్ పేరు వాడితే ఖబడ్దార్

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అపార్ట్‌మెంట్‌కి ఉన్న సీసీటీవీ ఆధారంగా ఆ దొంగ బాబా ఎవరో గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నందనవనంలో ఉన్నాడని గుర్తించి, అక్కడ అతడ్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మంగళసూత్రం రికవరి చేసి, తిరిగి మహిళకు అప్పగించారు. ఆ బాబాని అరెస్ట్ చేశారు.

Show comments