ఇంటర్ ఫలితాలపై విశ్లేషణ చేయాలంటున్న నిపుణులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా?
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Also Read
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు పరిశీలిస్తే… ఫెయిలైన విద్యార్థులు దారుణంగా విఫలమైతే… పాస్ అయిన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇంటర్‌నెట్ అందుబాటులో లేక, ఆన్‌లైన్ తరగతులు అందుకోలేక ఫెయిలైన విద్యార్థులు నష్టపోతే… ఆన్‌లైన్ క్లాసుల్ని చక్కగా అందిపుచ్చుకున్న విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నారు. 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే… 2 లక్షల 24 వేల 12 మంది పాస్ అయ్యారు. 2 లక్షల 35 వేల 230 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 49 శాతం పాస్ అయితే… 51 శాతం ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిలో 51 శాతం మంది 75 శాతం కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు. మరో 30 శాతం మంది 60 నుంచి 75 శాతం మధ్య మార్కులు తెచ్చుకున్నారు. అంటే పాసైన విద్యార్థుల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న వారు 80 శాతానికి పైగానే ఉన్నారు. పాసైన, ఫెయిలైన విద్యార్థుల అభ్యాసనంలో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
విద్యార్థుల తప్పేమీ లేదని… డిజిటల్ టీచింగ్ ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోందని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఎవరికైతే ఆన్‌లైన్ క్లాస్‌లు అందాయో వాళ్లు మంచి మార్కులు తెచ్చుకోగలిగారని, అందని వాళ్లు ఒకటి రెండు ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయలేకపోయారని అంటున్నారు. ఎక్కువగా గ్రామీణ, పేద విద్యార్థులే నష్టపోయారని TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యార్థులకు బ్లెండెడ్ మోడ్‌లో విద్య అందించాలని, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోతే ఒక జనరేషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల చేశాక తలెత్తిన వివాదం తర్వాతైనా ప్రభుత్వం మేల్కొని… విద్యార్థుల భవిష్యత్ కోసం చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెయిలైన వారిని పాస్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని… జాగ్రత్త పడకపోతే సెకండియర్‌లోనూ అలాంటి ఫలితాలే చూడాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!