NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: హాట్ కామెంట్స్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti

Ponguleti

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎవరి కష్టార్జితం వారిని అనుభవించనియ్యకుండా చేస్తున్నారు అంటూ పొంగులేటి విమర్శలు గుప్పించాడు.

Read Also: Asin: భర్తతో విడాకులు.. ఒకే హోటల్‌లో ధోనీతో అసిన్.. అసలేం జరుగుతోంది

200 గజాల స్థలం కొంటే ఆ స్థలం ఐదేళ్ల తర్వాత వారి చేతిలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నెలకొనింది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వాణిజ్య వ్యాపారులతో ముఖాముఖిలో కూడా హాట్ కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
గడిచిన 5 ఏళ్లలో మీతో పాటు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అన్నాడు. అధికారం ఉందని సామాన్యుల ఇంటిస్థలాలు కబ్జా చేశారని ఆయన చెప్పారు.

Read Also: Cocktails Challenge: బార్‌ మెనూలోని 21 కాక్‌టెయిల్స్ తాగడానికి ప్రయత్నించాడు.. చివరకు?

చెమటచుక్కలు చిందించి సంపాదించుకున్న మెతుకులు కూడా తిననివ్వలేని దౌర్భగ్యం ఖమ్మం జిల్లాలోని కొంతమంది నాయకులు చేస్తున్నారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ్యాపారం, కాంట్రాక్టులు కూడా వాల్లే చేయలంట.. ఇంకో రెండు నెలల్లో వాళ్లని కూకటి వేళ్ళతో పెకిలిస్తామన్నాడు. ప్రజల దీవెనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని పొంగులేటి తెలిపారు.

Read Also: Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రానికి సోకిన నిరంకుశ పాలనను పాలిస్తున్న ఘడీలకు తాళం వేసి ఇంటికి పంపుడే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈ రెండు నెలలు ఇబ్బందులు ఉంటాయి వాటిని మీరు భరించాలి.. రాబోయేది మన ప్రభుత్వమే.. నా కూతురి పెళ్లి కోసం Nsp కాలువ పై కట్టిన వంతెన రాత్రి కూల్చాలని ప్రయత్నం చేశారు.. రెండు నెలల్లో ఖేల్ ఖతం దు:ఖాన్ బంద్ అయిదని అన్నాడు. వారి శేష జీవితాన్ని కూడా మిగల్చొద్దు అని పొంగులేటి చెప్పాడు.